రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా, మరొకరు స్వల్పంగా గాయపడిన ఘటన విశాఖ మన్యం చింతలవీధిలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. యువకులు బైక్‌లను అతివేగంగా నడుపుతూ ఢీకొట్టినట్లు చింతలవీధి గ్రామస్థులు చెబుతున్నారు. యువకులు మద్యం సేవించి ద్విచక్రవాహనాన్ని నడిపినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి :