విశాఖ జిల్లా పాడేరులోని చికెన్ దుకాణంలో పని చేసే బొంజుబాబు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అతనితో పాటు రెండు గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. అయితే దుకాణదారులు రెండో కంటికి తెలియకుండా దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే అధికంగా మద్యం సేవించి చనిపోయినట్లు గ్రామస్థులను దుకాణ యజమాని నమ్మించాడు. కరెంట్ షాక్తో చనిపోయిన వ్యక్తి... అధికంగా మద్యం సేవించి చనిపోయాడని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : బోటు ప్రమాదంలో నంద్యాల వాసుల గల్లంతు