విశాఖ జిల్లా మన్యంలోని గిరి గ్రామంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఏడేళ్ల కుమార్తెను ఓ తండ్రి 3 కిలోమీటర్ల దూరం చేతులతో మోసుకుంటూ స్వగ్రామానికి తీసుకెళ్లాడు. మన్యంలోని డుంబ్రిగూడ మండలంలో వయ్యి గ్రామానికి చెందిన ఏడేళ్ల ఎలీచా... అనారోగ్యంతో అరకులోయ వైద్య కేంద్రంలో మృతిచెందింది. అంబులెన్స్‌లో కించుమండ సంత సమీపంలోని వంతెన వరకు తీసుకువచ్చారు.
హుద్‌హుద్ తుపాను సమయంలో ఆ వంతెన నేలకూలింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమార్తె మృతదేహాన్ని తండ్రి బాబూరావు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి రెండు చేతులతో పట్టుకుని తీసుకెళ్లాడు. కన్నబిడ్డ ప్రాణం పోయిందన్న బాధ వెంటాడుతున్నా... తప్పని పరిస్థితుల్లో మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లటం అందరినీ కంటతడి పెట్టించింది. ఏ తండ్రికీ ఇటువంటి పరిస్థితి రావొద్దని స్థానికులు ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: