విశాఖ జిల్లా చోడవరం మండలం ఖండేవల్లిలో అక్రమ కంకర తవ్వకాలను రెవెన్యూ సిబ్బంది నిలువరించారు. గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా కంకరను రవాణా చేస్తున్న విషయాన్ని గుర్తించారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది కంకర లోడ్‌తో ఉన్న 4 ట్రాక్టర్లను పట్టుకున్నారు. మండలంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చోడవరం తహసీల్దార్ రవికుమార్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: