ETV Bharat / state

YCP Leaders Land Grabbing: భూ బకాసురులు.. ఈ సారి ఏకంగా కాలనీపైనే పడ్డారు.. - వైసీపీ నేతల భూ ఆక్రమణలు

YCP Leaders Land Grabbing: ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములే కాదు.. దశాబ్దాల క్రితం ఇళ్లు కట్టుకున్న ప్రాంతాలను కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకుగా ఉన్న భూములు తమవేనంటూ కట్టుకున్న ఇళ్లను సైతం ఖాళీ చేయిస్తున్నారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల విలువైన స్థలాలను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. శ్రీకాళహస్తి శివారులో పేదప్రజలు నివసిస్తూ కాలనీని వైసీపీ నేతలు హస్తగతం చేసుకునేందుకు కుట్రపన్నుతున్నారు.

YCP Leaders Land Grabbing
భూములను కబ్జా చేస్తున్న వైసీపీ నేతల
author img

By

Published : Jun 20, 2023, 8:21 AM IST

YCP Leaders Land Grabbing: అధికారపార్టీ నేతల భూకబ్జాలు.. ఈ సారి ఏకంగా కాలనీపైనే పడ్డారు..

YCP Leaders Land Grabbing: భూమి విలువ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఖాళీ స్థలాలే కాదు.. ఇప్పటికే అక్కడ నిర్మించిన ఇళ్లను సైతం బలవంతంగా ఖాళీ చేయించి కబ్జాలకు పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శివారులోని ఈదులగుంటలో కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేతలు.. రెవెన్యూ రికార్డుల పేరిట హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

శ్రీకాళహస్తి మండలం అప్పలాయగుంటలోని సర్వే నంబరు 45/1లోని 2.18 ఎకరాలు, 45లో 2.39 ఎకరాలు, తొట్టంబేడు మండల పరిధిలోని సర్వే నంబరు 42లో 20.25 ఎకరాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈదులగుంట చెరువు పొరంబోకుగా ఉంది. ఈ భూముల్లో దాదాపు 3 దశాబ్దాలుగా పేదలు ఇళ్లు నిర్మించుకుంటూ వచ్చారు.

Possession of Temple Land కోట్లు విలువచేసే ఆలయ భూమిపై వైసీపీ నేత కన్ను.. అధికారులే సహకరిస్తున్నట్లు ఆరోపణలు

30 ఏళ్లుగా అటు రెవెన్యూ అధికారులు గానీ, నీటిపారుదల అధికారులు గానీ ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు. అందరూ శాశ్వత నిర్మాణాలు చేసుకున్నారు. పట్టణం విస్తరించి శివారు భూముల విలువ పెరగడంతో అధికార పార్టీ నేతల కన్ను చెరువు పొరంబోకు భూములపై పడింది. ఇప్పుడు ఏకంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

శ్రీకాళహస్తికి చెందిన కొందరు అధికార పార్టీ వ్యక్తులు ఆ భూమి తమదంటూ ఖాళీ చేయించడానికి నిరుపేదలపై ఒత్తిడి తెస్తున్నారు. అర్థరాత్రులు సైతం రెవెన్యూ, పోలీసు సిబ్బందిని తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఇది జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని..కష్టపడి సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నామని ఇప్పుడు ఉన్న ఫళంగా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్లాలంటూ స్థానికులు వాపోతున్నారు.

Temple lands: దేవాలయ భూములు.. అప్పనంగా దోచుకుంటున్న పెద్దలు

శాశ్వత నివాసులు ఏర్పరుచుకున్న ఈ భూముల్లో గత ప్రభుత్వాలు విద్యుత్‌ లైన్లు, సిమెంట్‌ రోడ్లు , నీటి కుళాయిలు సైతం ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం సెటిల్‌ మెంట్‌లో ఈ భూమి తమకు వచ్చిందని అందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"మేము 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాము. ఎవరో కొంత మంది వస్తున్నారు.. మమ్మల్ని ఖాళీ చేయమని అంటున్నారు. మేము వారిపై అరిస్తే.. మళ్లీ వెళ్లిపోతున్నారు. మళ్లీ రెండు రోజులకు వస్తున్నారు. అసలు ఎవరెవరో వస్తున్నారు. పోలీసులను తీసుకొనివస్తున్నారు". - స్థానికురాలు

కొల్లేరులో అక్రమ చెరువుతవ్వకాలు.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.. అడ్డుకున్న అటవి,రెవెన్యూ సిబ్బంది

"మేము ఇక్కడ ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడేమో ఏవరో వచ్చి.. మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్లిపోమని అంటున్నారు. మాకు పట్టాలు ఉన్నాయి అని చెప్తున్నారు. పోలీసులను తీసుకొని వస్తున్నారు. రోజుకు ఒకరు వస్తున్నారు". - స్థానికురాలు

"మీరు ఇక్కడ ఉండకూడదు అని దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఇక్కడ 35 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఇప్పుడు ఎక్కడకి వెళ్లాలి. ఇక్కడ కరెంటు, బోరు అన్నీ ఉన్నాయి". - స్థానికురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.