ETV Bharat / state

Security In Tirumala: తిరుమలలో భద్రత పటిష్టం చేసేలా చర్యలు.. భౌతిక, సైబర్ సెక్యూరిటీపై అధ్యయనం - Security In Tirumala

TTD Actions to Strengthen security in Tirumala: ఏడుకొండల వాడి ఆలయ భద్రతను పటిష్టం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం.. చర్యలు మొదలుపెట్టంది. భౌతిక, సైబర్ సెక్యూరిటీపై కేంద్ర, రాష్ట్ర భద్రతాధికారులు ద్వారా.. టీటీడీ అధ్యయనం చేయిస్తోంది. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ.. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను తిరుమలలో ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది.

Security In Tirumala
Security In Tirumala
author img

By

Published : May 25, 2023, 3:25 PM IST

TTD Actions to Strengthen security in Tirumala: మారుతున్న కాలానుగణంగా సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను పటిష్టం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. భౌతిక, సైబర్ సెక్యూరిటీపై కేంద్ర, రాష్ట్ర భద్రత అధికారులు ద్వారా టీటీడీ అధ్యయనం చేయిస్తున్నారు. భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను తిరుమలలో ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది.

అఖిలాండ బ్రహ్మాండనాయకుడ్ని దర్శించుకునేందుకు తిరుమలకు రోజూ 60 వేల నుంచి 75 వేల మంది భక్తులు వస్తుంటారు. తిరుమల పుణ్య క్షేత్రంలో మూడంచెల భద్రత ఉన్నప్పటికీ.. ఎక్కడో ఒకచోట లోపం జరుగుతూనే ఉంది. దర్శన టికెట్ల అమలు నుంచి భద్రత పరమైన అంశాల వరకు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. మారుతున్న కాలానుగుణంగా టీటీడీ అనుసరిస్తున్న వర్చువల్ విధానం అత్యంత పటిష్ఠమైనదైనా.. సైబర్ నేరగాళ్లు ఏదో రకంగా నకిలీ టికెట్లను రూపొందించి మరి భక్తులను మోసగించిన సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గంజాయి, మద్యం వంటివి తరలిస్తున్నా.. నియంత్రించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న శ్రీవారి ఆలయంలోకి ఓ యువకుడు చరవాణిని తీసుకొని వెళ్లి మరీ ఆనంద నిలయాన్ని చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, ఉగ్రవాదులు తిరుమలలో సంచరిస్తున్నట్లు నకిలీ మెయిల్‌ రావడం, సీఎంవో స్టికర్‌తో కూడిన వాహనం మాడవీధుల్లోకి రావడం వంటివి తిరుమల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కోట్ల మంది భక్తులలో ఆందోళన కలిగిస్తున్నాయి.

సవాళ్ల మధ్యే తిరుమలలో మూడంచెల భద్రతను పటిష్టం చేసేందుకు టీటీడీ అడుగు ముందుకు వేసింది. తిరుమల భద్రతపై ముఖ్య అధికారిగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. రెండు రోజులుగా అన్నమయ్య భవనంలో ఆయన.. టీటీడీ భద్రతా అధికారులు, ఇంటెలిజెన్స్, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ భద్రతా విభాగంతో పాటు రాష్ట్రం నుంచి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని హరీష్ కుమార్ గుప్తా అన్నారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్​లో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్​వేర్​ను వాడాలి అనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. అదే విధంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు.

తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఏస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు కమిటీలు ఏర్పాటు చేశామని.. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

తిరుమలలో భద్రత పటిష్టం చేసేలా చర్యలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.