ETV Bharat / state

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు - Vaikunta Dwara dharshan in tirumala

TTD Prepares for Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారి ఆలయంలో పదిరోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి రెండు నుంచి పదకొండో తేదీ వరకు రోజుకు దాదాపు 80 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా తితిదే చర్యలు చేపట్టింది. టికెట్లు ఉన్న వారినే క్యూలైన్లలోకి అనుమతించి దర్శనం కల్పించేలా ప్రణాళిక చేపట్టారు.

ttd
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం
author img

By

Published : Dec 30, 2022, 7:34 PM IST

వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ

TTD Prepares for Vaikunta Dwara Darshan: కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజుల పాటు వైకుంఠ ద్వారప్రవేశానికి తితిదే చర్యలు చేపట్టింది. రోజుకు 80 వేల మంది శ్రీవారిని దర్శించుకొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 20వేల మంది.. సర్వదర్శనం ద్వారా 50 వేల మంది, శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చిన భక్తులు 2వేల మందితో పాటు సిఫారసు లేఖలతో మరికొందరికి దర్శనాలు కల్పించనుంది. 10రోజుల పాటు 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన తితిదే.. మరో ఐదు లక్షల సర్వదర్శన టికెట్లను తిరుపతిలో జారీ చేయనుంది.

సర్వదర్శనం టోకెన్లను రోజుకు 50వేల చొప్పున జారీ చేయడానికి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 92 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారిని దర్శించుకొనే సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను జనవరి ఒకటి మధ్యాహ్నం 2గంటల నుంచి జారీ చేస్తారు. 10రోజుల కోటా పూర్తయ్యేంత వరకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి భక్తుల రద్దీ దృష్ట్యా.. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించేలా తితిదే అధికారులు చర్యలు చేపట్టారు.

"తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజుల పాటు.. దాదాపు 8 లక్షల మందికి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో.. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడకుండా.. ప్రత్యేక సమయ నిర్దేశిత టోకెన్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రోజుకు 80 వేల మందికి.. పది రోజుల పాటు దర్శనం చేసుకోనున్నారు". - అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తితిదే ఇంఛార్జ్‌ ఈవో

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.