ETV Bharat / state

Tataiahgunta Gangamma Jatara Ended: ఘనంగా ముగిసిన తాతయ్యగుంట గంగమ్మ జాతర

author img

By

Published : May 17, 2023, 2:01 PM IST

Updated : May 17, 2023, 2:19 PM IST

Tataiahgunta Gangamma Jatara Ended: తొమ్మిది రోజుల పాటు సాగిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం ముగిసింది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి జాతర కావడంతో.. మరింత వైభవంగా నిర్వహించారు. పాలెగాళ్ల అరాచకలను అంతం చేసేందుకు ఉద్భవించిన గంగమ్మకు రోజుకొక వేషధారణలో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

Etv Bharat
Etv Bharat

ఘనంగా ముగిసిన తాతయ్యగుంట గంగమ్మ జాతర

Tataiahgunta Gangamma Jatara Ended : పాలెగాళ్ల అరాచకాలను అంతమొందిచేందుకు ఉద్భవించిన దేవతగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలు అందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని తాతయ్యగుంటలో వెలసిన గంగమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడు కొండల వెంకన్నకు ఆడపడుచుగా భావిస్తూ గంగమ్మకు భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి రోజా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఏడు రోజుల పాటు రోజుకొక వేషం : గంగమ్మ ఆలయంతో పాటు తిరుపతిలో వెలసిన వేషాలమ్మ గుడిలోనూ ఒకే కాలంలో జాతర నిర్వహించారు. గంగమ్మ జాతరలో వేషాలు కట్టి భక్తులు.. వేషాలమ్మ గుడి నుంచి యాత్రను ప్రారంభించడం సంప్రదాయం. భక్తులు రోజుకొక వేష ధారణలో అమ్మవారిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అదే విధంగా ఈ ఏడు రోజుల పాటు రోజుకోక వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకోని, మొక్కులు చెల్లించుకున్నారు.

తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో నిమగ్నమైన భక్తులు : ఈ జాతరలో చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా తోటివేషం ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో నిమగ్నం అయ్యారు. బొగ్గు పొడిని శరీరమంతా పూసుకుని తెల్లనామం సాది కనుబొమ్మలపైన చుక్కబొట్లు పెట్టుకుని, వేపాకు మండలను కట్టుకుని బూతులు తిడుతూ సంచరిస్తే గంగమ్మ పరవశించి వారి కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.

అమ్మవారిని మాతంగి వేషంలో దర్శించుకున్న భక్తులు : గంగమ్మ జాతరలో భాగంగా భక్తులు మాతంగి వేషంలో గంగమ్మకు దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. మగవారు ఆడవారికి ఏ మాత్రం తీసుపోని విధంగా కట్టు, బొట్టుతో పాటు మల్లెపూలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాతంగి వేషంతో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోర్కెలు తీరుతాయని వారి విశ్వాసం.

ముగిసిన గంగమ్మ జాతర : తొమ్మిది రోజుల పాటు సాగిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం ఘనంగా ముగిసింది. వైభవోపేతంగా జరిగిన అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తొలుత గంగమ్మ ఆలయంలో స్తంభానికి అర్చకులు విశ్వరూప ధారణ చేశారు. నీలవర్ణ శోభితమై భక్తులను కటాక్షించే అమ్మావారి వీక్షణ కోసం నగరవాసులు తెల్లవారు జామునుంచే ఆలయం వద్ద పోటెత్తారు. నగరంలో ఇంటింటికీ తిరుగుతూ నీరాజానాలందుకుంటున్న గంగమ్మ పేరంటాల వేషధారణలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి హారతి ఇవ్వటంతో జాతర ముగిసింది. బంకమట్టి గడ్డితో తయారు చేసిన ఈ విశ్వరూప మృతికను ఇంటికి తీసుకెళ్తే మంచి జరుగుతుందనే నమ్మకం అనాదిగా వస్తుండటంతో మృతిక తీసుకోవటం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.

ప్రత్యేక చర్యలు తీసుకున్న ఆలయ అధికారులు, పోలీసులు : తాతయ్యగుంట గంగమ్మ జాతరకు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోని వారి కోర్కెలు తీర్చుకునేందుకు భక్తులు వచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదండి

Last Updated : May 17, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.