ETV Bharat / state

ఈ ఏడాది తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..! - Tirumala Latest News

Tirumala Hundi Revenue : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం అధికారుల అంచనాలకు మించి సమకూరుతోంది. 2022-23 సంవత్సరంలో హుండీ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు సమకూరుతుందని అధికారులు అంచనా వేయగా.. 1320 కోట్ల రూపాయలకు పైబడి చేరింది. 2022 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు తిరుమల శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా...1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో హుండీ ద్వారా ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఆదాయం సమకూరింది.

అంచనాలకు మించి సమకూరుతున్న... తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం

author img

By

Published : Dec 30, 2022, 11:02 PM IST

Tirumala Hundi Revenue: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సైతం అదే స్థాయిలో పెరిగింది. కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలు ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచి తొలగించడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. 2022 సంవత్సరంలో తిరుమల శ్రీవారిని రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకొన్నారు. కోటి ఎనిమిది లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న భక్తులు సమర్పించిన హుండీ కానుకలతో శ్రీవారికి డిసెంబర్‌ 30 నాటికి 1320 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న భక్తుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపైంది. 2021 జనవరి నుంచి డిసెంబర్‌ చివరి వరకు కోటి నాలుగు లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా.. హుండీ ద్వారా 833 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దాదాపు యాబై లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.