ETV Bharat / state

Hidden Treasures: గుప్త నిధుల కోసం వెళ్లారు.. కానీ..!

Hidden Treasures: గుప్త నిధుల కోసం.. తవ్వకాలకు యత్నించిన ఓ ముఠాకు అనుకోని పరిస్థితి ఎదురైంది. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. తవ్వకాలకు, రాళ్లు పగలకొట్టడానికి తీసుకెళ్లిన సామగ్రిని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

Hidden Treasures
గుప్త నిధులు
author img

By

Published : May 5, 2023, 6:34 PM IST

Hidden Treasures: రాష్ట్రంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పురాతన, చారిత్రక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఆగంతుకులు గుప్త నిధుల కోసం తమ వేట కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా గుప్త నిధుల కోసం తవ్వకాలకు యత్నించిన ఏడుగురు సభ్యుల ముఠాను.. పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో వివిధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే: తిరుపతి జిల్లా చంద్రగిరిలో గుప్త నిధుల కోసం ఓ ముఠా యత్నించింది. ఏడుగురు వ్యక్తులు ఉన్న ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు గతంలో కూడా గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

డ్రిల్లింగ్ మెషిన్, ఇన్వర్టర్ బ్యాటరీ, నల్లమందు: ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి తవ్వడానికి ఉపయోగించే ఇనుప వస్తువులు, పలుగు, పారలు అదే విధంగా ఇన్వర్టర్ బ్యాటరీ, నల్లమందు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తీసుకొని వెళ్లి మరో వ్యక్తి కోసం వేచిచూస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు.

కోటకు సమీపంలో: చారిత్రక కట్టడం చంద్రగిరి కోటకు సమీపంలోని తవ్వకాలు చేపట్టినందుకు ఈ ముఠా ప్రయత్నించింది. రాయల వారి కోట సమీపంలోని దుర్గం కొండపై తవ్వకాల కోసం మొదట కొన్ని రోజులు రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. వీరిని చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను సీఐ ఓబులేసు మీడియాకు తెలిపారు.

ఎలా పట్టుబడ్డారంటే?: గుప్త నిధుల కోసం రెక్కీ నిర్వహించిన అనంతరం.. రాళ్లు పగలగొట్టడానికి కావలసిన నల్లమందు, డ్రిల్లింగ్ మెషిన్ బ్యాటరీలు, ఇతర సామాగ్రితో దుర్గం కొండపైకి చేరుకున్నారని తెలిపారు. అయితే ఆ కొండపైన నిధులు ఎక్కడ ఉన్నాయో పక్కాగా చెప్పేందుకు కదిరికి చెందిన మహబూబ్ భాషా అనే వ్యక్తి కోసం ఎదురు చూశారు.

ఎంత సేపటికీ మహబూబ్ బాషా రాకపోవడంతో.. ముఠా సభ్యులు కొండ పైనుంచి కిందకి వచ్చేశారు. ఈ సమయంలో రోడ్డుపై సంచరిస్తుండగా వీరిపై అనుమానం వ్యక్తం చేసిన వారు రహస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులకు అందిన సమాచారం మేరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

గతంలో కూడా గుప్త నిధుల కోసం ప్రయత్నాలు: ఈ ముఠా సభ్యులు కొందరు గతంలో కాణిపాకం పరిసర ప్రాంతాలలో గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే కదిరికి చెందిన మహబూబ్ భాషా అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ ఓబులేసు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.