తిరుపతి జిల్లా వెంకటగిరిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం పేరుతో పాల్పడిన రూ. 30 లక్షల సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అహ్మదాబాద్లో అరెస్టు చేశారు. వెంకటగిరి పట్టణంలో నివాసముంటున్న పవన్ అనే వ్యక్తి.. 2020లో లాక్డౌన్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోం జాబ్కి ఆన్లైన్లో అప్లై చేశాడు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కిన పవన్.. జాబ్ కోసం రూ. 30 లక్షలు ఆన్లైన్లో చెల్లించాడు. చివరకు తాను మోసపోయానని తెసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించిన పోలీసులు.. అహ్మదాబాద్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ముంబాయిలో ఉన్న ప్రధాన నిందితుడు రవి అనే వ్యక్తిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: చోరీలు చేయడంలో ఈ దొంగ రూటే సెపరేటు.. మీరే చూడండి..!