Interstate thief arrested : తమిళనాడు నుంచి వచ్చి తిరుపతి పరిసర ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నఅంతరాష్ట్ర దొంగను తిరుపతి జిల్లా పాకాలలో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 334గ్రాముల బంగారం, 570గ్రాముల వెండి, ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాకు చెందిన రాఘవన్ విజయ్ గతంలో దొంగతనాల కేసుల్లో పదేళ్లు జైల్లో శిక్ష అనుభవించాడని చెప్పారు.
ఈ మధ్య విడుదలైన విజయ్ తిరుపతి జిల్లాను టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడ్డాడని..ఇతని పై ఇప్పటికే 8 కేసులు ఉన్నాయని చెప్పారు. దామలచెరువు-నేండ్రగుంట రోడ్డు మార్గంలోని దేశిరెడ్డిపల్లి వద్ద రాఘవన్ విజయ్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజశేఖర్ చెప్పారు.
ఇవీ చదవండి: