ETV Bharat / state

కన్నబిడ్డల నుంచి రక్షించండి.. ఓ వృద్ధురాలి వేదన

author img

By

Published : Nov 3, 2022, 4:37 PM IST

Old Woman's Agony: మనషుల్లో మానవత్వం కరువవుతోంది.. బంధాలకు విలువ లేకుండాపోతోంది.. అనుబంధాలకే చోటు లేదు.. కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అంటోంది లోకం. డబ్బు మాయలోపడి ప్రేమానురాగాలు మరిచిపోతున్నారు.. చివరకు కన్నవారనే కనికరం చూపకుండా రోడ్డన పడేస్తున్నారు. ముగ్గురు పిల్లలు కన్న ఆ అమ్మ అనాథగా మారింది.. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో జరిగింది.

munemma
మునెమ్మ

Old Woman's Agony: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఆరేపల్లి రంగంపేటకు చెందిన మునెమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం క్రితం భర్త మర్రమందడి మృతి చెందడంతో ఇల్లు, కొంత భూమి ఆమెకు తన భర్త ద్వారా వారసత్వంగా సంక్రమించింది. ఎవరిపైనా ఆధారపడకుండా వృద్దాప్యంలో కూడా ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ డబ్బులతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. కుమార్తెలు, అల్లుళ్లు ఆస్తి కోసం వేధిస్తున్నారని ఆమె వాపోయింది. గురువారం పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.

ఇల్లు, భూమి తమ పేరిట రాయాలని కుమార్తెలు ఒత్తిడి చేస్తున్నారని చెప్పింది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేసినా.. వారి మాటలు వినడం లేదని మునెమ్మ వాపోయింది. తమ పిల్లలతో తనకు ప్రాణహాని ఉందని.. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.