ETV Bharat / state

జగన్ జైలుకు వెళితే సీఎం కావాలని మంత్రి పెద్దిరెడ్డి ఎదురుచూస్తున్నాడు: లోకేశ్‍

Lokesh Comments On Minister Peddi Reddy : జగన్ జైలుకు వెళితే ముఖ్యమంత్రి కావాలని ఎదురుచూస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు చేసిందేమి లేదని లోకేశ్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గం కొక్కువారిపల్లి విడిది కేంద్రం నుంచి 34వ రోజు యువగళం పాదయాత్ర లోకేష్ ప్రారంభించారు. కల్లూరులో నిర్వహించిన హలో లోకేశ్‍ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు.

Lokesh
లోకేశ్‍
author img

By

Published : Mar 4, 2023, 5:13 PM IST

Lokesh Comments On Minister Peddi Reddy : జగన్ జైలుకు వెళితే ముఖ్యమంత్రి కావాలని ఎదురుచూస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు చేసిందేమి లేదని లోకేష్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గం కొక్కువారిపల్లి విడిది కేంద్రం నుంచి 34వ రోజు యువగళం పాదయాత్ర లోకేశ్ ప్రారంభించారు. కల్లూరులో నిర్వహించిన హలో లోకేశ్‍ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. పుంగనూరులో పరిశ్రమలు రాకపొవడానికి కారణం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అని లోకేశ్‍ ఆరోపించారు. టీడీపీని గెలిపిస్తే పుంగనూరులో పరిశ్రమలను తీసుకవచ్చే భాద్యత తాను తీసుకుంటానని లోకేశ్‍ తెలిపారు. జగన్‍ రెడ్డి పాలనలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా చిత్తూరు అని లోకేశ్‍ తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే క్రమ పద్దతిలో జాబ్‍ క్యాలెండర్‍ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు, ఓసీలలో ఉన్న పేదవారికి కార్పొరేషన్లు పునరుద్దరించి స్వయం ఉపాధి లభించేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో స్టార్టప్​లను ప్రోత్సహిస్తామన్నారు.

యువగళం పేరిట తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 4వేల కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారమే జనవరి 27వ తేదిన పాదయాత్ర ప్రారంభమైంది. కాగా దీనికి పోలీసులు, ప్రభుత్వం అనేక అంక్షలు విధించినా.. అవి తేలిపోయాయి. పోలీసులు యువగళంపై అడిగిన వివరాలు గొంతెమ్మ కోరికల లాగా ఉన్నాయని టీడీపీ నేతలు అన్నారు

యాత్ర పుంగనూరుకు చేరకముందు తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో సాగింది. లోకేశ్ పాదయాకత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. వారికి నేనున్నాను అని ధీమాను నింపుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నాడు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని పిలుపునిస్తున్నాడు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నలు సంధిస్తున్నాడు. సీఎం, మంత్రులపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టి పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన వస్తుంది. నాయకులు, కార్యకర్తలు వెంటరాగా మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు.

పాడి రైతులకు పేమెంట్ చేయరు. సరిగా..మామిడి రైతులకు పేమెంట్ చేయరు. పుంగనూరులో పెద్దిరెడ్డి మిగిల్చింది పాపాలే.. పుంగనూరు అభివృద్ధేంటో యువకులకు నేను చూపిస్తా.. పుంగనూరులో మళ్లీ పసుపు జెండా ఎగిరే విధంగా పోరాడాలి. కార్యకర్తలకు నేను ఒకటే హామి ఇస్తున్న.. కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు, మీ(కార్యకర్తల) పై ఎవరు తప్పుడు కేసులు పెట్టారో నాకు తెలుసు. మనం అధికారంలోకి వచ్చాక వారి తోలు తీస్తా.-నారా లోకేశ్‌,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

పుంగనూరులో పరిశ్రమలు రాకపొవడానికి కారణం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.