Tiruchanur Sri Padmavati Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై.. శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో.. కోలాటాలు, నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు.. హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.
ఇవీ చదవండి: