State Electricity Regulatory Board Chairman: రెండు వందల యూనిట్ల పైబడి విద్యుత్‌ను వినియోగించే వారికే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 18వ రాష్ట్ర స్ధాయి సలహా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్లకు, సాధారణ మీటర్లకు చాలా తేడా ఉంటుందని అన్నారు. గుర్రానికి, కారుకు మధ్య.. కారు, విమానానికి మధ్య తేడా ఉంటుందని.. అదే తరహాలో స్మార్ట్ మీటర్లు, సాధారణ మీటర్ల మధ్య తేడా ఉంటుందని అన్నారు. సమావేశంలో మూడు విద్యుత్ సంస్ధల ప్రతిపాదనలపై,.. అలాగే వచ్చే సంవత్సరానికి ఆదాయాల అవసరాల నిమిత్తం చర్చించామని.. త్వరలోనే కొత్త టారిఫ్ ప్రకటిస్తామన్నారు.
30 సంవత్సరాల వరకు ఉచిత విద్యుత్ పంపీణీ: విద్యుత్ పంపీణి వ్యవస్థలో బాధ్యత తీసుకొచ్చేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాట్లు చేస్తున్నామనీ, రైతుల వద్ద నుంచి చార్జీలు వసూలు చేసే ప్రసక్తే లేదని, తరువాత కనీసం 30 సంవత్సరాల వరకు ఉచిత విద్యుత్ పంపీణీ చేసేందుకు ఏడు వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) నుంచి తీసుకుంటున్నామన్నారు. సప్లయ్ చేసే ప్రతీ యూనిట్ మీటర్ ద్వారానే సప్లయ్ చేస్తారనీ, కాలానుగుణంగా అప్పటి ప్రభుత్వాల విధానపరమైన విధానాల వల్ల మీటర్లు తీసేయడం జరిగింది. ప్రభుత్వం రైతుల వద్ద విద్యుత్ చార్జీలు వసూలు చేయడానికి స్మార్ట్ మీటర్లు పెట్టడం లేదని చెప్పిందని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు.
"స్మార్ట్ మీటర్స్ అగ్రికల్చర్ కన్జూమర్కి ఏమి భారం లేదు. కన్జూమర్కి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇందతా టెక్నాలజీ అడ్వాంటేజ్. స్మార్ట్ మీటర్లు, సాధారణ మీటర్ల కంటే అడ్వాంటేజ్. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. " - జస్టిస్ నాగార్జున రెడ్డి, విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్
ఇవీ చదవండి