ETV Bharat / state

కరోనా కలకలం: అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్​కు!

author img

By

Published : Jul 11, 2020, 10:46 PM IST

శ్రీకాకుళం జల్లా సవరపేటలో కరోనా కలకలం అందరినీ ఆందోళనకు గురి చేసింది. గ్రామానికి చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకోగా.. కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు. అంతకుముందే నిపుణులు కరోనా పరీక్షలు చేయగా.. అంత్యక్రియల అనంతరం వచ్చిన ఫలితంలో పాజిటివ్ అని తేలింది.

Worrying about corona cases in savarapeta srikakulam district
కరోనా కలకలం : అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరూ క్వారంటైన్​కు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సవర పేట గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

మృతురాలికి అంత్యక్రియలకు ముందే కరోనా పరీక్షలు చేయగా.. అంత్యక్రియల అనంతరం పాజిటివ్ గా ఫలితం వచ్చింది. ఇది తెలిసిన గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ రాంబాబు, ఎస్సై కామేశ్వరరావు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 70 మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

సీతారాముల విగ్రహాలకు వానరం పాదాభివందనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.