సంతబొమ్మాళి మండలంలోని పిట్టవానిపేట, గద్దలపాడు, గొలుగువానిపేట, ఎం.సున్నాపల్లి, డి.మరువాడ గ్రామాల్లో 20 మంది మహిళలు మోసానికి గురయ్యారు. 40 తులాల వరకు బంగారం పోగొట్టుకున్నారు. గతేడాది డిసెంబరు నెలలో గ్రామాల్లో పర్యటించిన ఇద్దరు మహిళలు.. బంగారు కాసులపేర్లకు తక్కువ ధరకే తాళ్ళు అల్లుతామని, మెరుగు పెడతామని చెప్పారు. వారి మాటలు నమ్మిన మహిళలు... మెరుగు పెట్టించుకుని తాళ్ళు అల్లించుకున్నారు. మూడు రోజుల తరువాత వచ్చి కాసులపేర్లకు అల్లిక పువ్వులు పెడతామని చెప్పి, అసలు కాసుల పేర్లు మార్చేసి నకిలీవి అంటగట్టారు. రెండు నెలల తరువాత కాసుల పేర్లు రంగుమారడంతో అనుమానం వచ్చి బంగారం దుకాణాల్లో పరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇప్పటికే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇవీ చూడండి...