ETV Bharat / state

పలాస ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు... నాణ్యమైన బియ్యం పంపిణీ - ration

పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు వాలంటీర్లు రేషన్ పంపిణీ చేశారు. బియ్యం సంచితో పాటు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే దిగిన ఫోటో వైరల్​గా మారింది. ఎమ్మెల్యేకు తెల్ల రేషన్​ కార్డు ఎక్కడి నుంచి వచ్చిందంటూ పలువురు ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.

ఎమ్మెల్యే ఇంటికి రేషన్ సరుకులా?
author img

By

Published : Sep 10, 2019, 4:49 AM IST

ఎమ్మెల్యే వివరణ

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు రేషన్‌ సరుకులు తీసుకుంటున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే కుటుంబానికి తెల్ల రేషన్‌ కార్డు ఉండటంతో వాలంటీరు రేషన్‌ సరుకులను ఇంటికి తెచ్చి ఇచ్చారు. బియ్యం సంచితో పాటు కుటుంబ సభ్యులతో దిగిన చిత్రాన్ని ఎమ్మెల్యే అప్పలరాజు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఉంచారు. "నాకు బియ్యం అప్పంగించిన విధానం ప్రకారం... వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది. గుమ్మం వద్దకే వచ్చి వారు సేవలు అందిస్తున్నారు. ఇదే పాలనలో పారదర్శకత అంటే" అని ఆయన పోస్టు చేశారు. ఇది విస్తృతం కావటంతో ఆయనకు తెల్ల రేషన్​కార్డు ఎలా వచ్చిందంటూ పలువురు ప్రశ్నించారు.

రేషన్​కార్డు విషయంపై ఎమ్మెల్యే అప్పలరాజు స్పందించారు. 2010-11లో గులాబీ కార్డు కోసం దరఖాస్తు చేయగా తెలుపు కార్డును రెవెన్యూ శాఖ మంజూరు చేసిందన్నారు. వెంటనే రేషన్‌ కార్డు రద్దు చేయాలని దరఖాస్తు చేసినట్లు పలాస ఎమ్మెల్యే తెలిపారు. తన పేరున మీద ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్నట్లు తెలియదని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పేరుతో ఉన్న రేషన్‌ సరుకులు ఎవరు తీసుకుంటూన్నారో విచారణ చేపట్టాలని అధికారులను కోరారు.

ఇవీ చదవండి

ముక్కిపోయి.. దుర్వాసన వస్తోన్న బియ్యాన్ని ఎలా తినాలి?

Intro:ap_knl_21_09_rtc_godava_av_AP10058
యాంకర్, టికెట్కు సరిపడా చిల్లర ఇవ్వక పోవడంతో తిరిగి ఇవ్వాల్సిన మొత్తంలో తేడా రావడంతో ప్రయాణికుడుకి బస్సు డ్రైవరుకు జరిగిన గొడవ ఇది. నాకింత మొత్తం ఇవ్వాలని.. లేదు నేనింతే ఇస్తానని వాగ్వివాదం జరిగింది. ఇద్దరూ పరస్పరము దూషించుకున్నారు. ఈ క్రమంలో డ్రైవరు వద్దనున్న టిక్కెట్ ఇచ్చే యంత్రాన్ని ప్రయాణికుడు పట్టుకెళ్లాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మూడో పట్టణ పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు.
తిరుపతి నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కర్నూలు జిల్లా చాగలమర్రి వద్ద బాషా అనే వ్యక్తి ఎక్కాడు. నంద్యాల నూనెపల్లె వద్ద దిగాడు. దిగే క్రమంలో టికెట్ వెనుక రాసిన మొత్తము రూ.15ను ప్రయాణికుడు బాషా కు ఇవ్వడంతో తీసుకోలేదు. వంద నోటు ఇచ్చావు.. టిక్కెట్ రూ.85 పోతే రూ.15 కదా అని డ్రైవర్ అన్నాడు. లేదు రూ.200 ఇచ్చాను అంటూ రూ .115 ఇవ్వాలంటూ ప్రయాణికుడు అన్నాడు. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకున్నారు. దిగాలని డ్రైవర్ దుబ్బే ప్రయత్నం చేశాడు. దీనితో ఆగ్రహించిన ప్రయాణికుడుబాషా టిక్కెట్ మిషన్ తీసుకెళ్లి పారిపోయాడు. బస్ డ్రైవర్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. స్పందించిన పోలీసులు ప్రయాణికుడు బాషా ను పట్టుకుని పోలీసు స్టేషన్లో అప్పజెప్పారు. ఆర్టీసీ అధికారులు సూచన మేరకు పోలీసులు సమస్య పరిష్కరించి ఇద్దరినీ సాగనంపారు.

Body:ఆర్టీసీ గొడవ

Conclusion:8008573804,సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.