ETV Bharat / state

మా సమస్యలు తీర్చండయ్యా..! - శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది కాలువ వార్తలు

వంశధార నది నుంచి పలు ఓపెన్ హెడ్ కాలువల ద్వారా  నేరుగా సాగునీరు పంట పొలాలకు  అందించేవారు.  50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చివరి భూములకు సాగునీరు అందడం లేదు. ఆయకట్టు చివరి భూముల పరిస్థితి దయనీయంగా మారింది.  తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది కాలువ
శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది కాలువ
author img

By

Published : Aug 30, 2020, 7:36 PM IST

Updated : Aug 30, 2020, 8:06 PM IST

శ్రీకాకుళం జిల్లాలో 1,48,242 ఎకరాలకు ఆయకట్టు నిచ్చే వంశధార ప్రాజెక్ట్ ఆవిర్భవించి 50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చివరి భూములకు సాగునీరు అందడం లేదు. పలు మండలాల్లో రైతులు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి... కానీ కాలువ చివరి భూములకు మాత్రం నీరు లభించడం లేదు.

వంశధార ఎడమ కాలువ పరిధిలోని ఎన్​బీసీ కాలువకు అనుసంధానంగా ఉన్న 11 ఆర్ కిళ్లాం మేజర్ కాలువ దిగువన 4400 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు చివరి భూముల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం మబగాం గ్రామానికి కూడా వంశధార కాలువ నుంచే నీరు వెళుతుంది. అక్కడ కూడా ఇదే సమస్య ఉంది. నరసన్నపేట మండలం మాకివలస, కిళ్లాం, గోపాలపెంట, దేవాది తదితర గ్రామాలకు ఈ మేజర్ కాలువ నుంచే నీరు సరఫరా కావాలి. ఒకప్పుడు ఈ గ్రామాలతోపాటు మరి కొన్ని గ్రామాలు కూడా ఓపెన్ హెడ్ కాలువ ద్వారా సాగునీరు పొంది సస్యశ్యామలంగా ఉండేవి.

నరసన్నపేట మండలం మాకి వలస, కిళ్లాం, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం సాగునీటి కోసం కాలువల బాటపట్టారు. 100 మంది రైతు బృందం అంతా కాలినడకన బయల్దేరి దాదాపు 30 కిలోమీటర్ల మేర కాలువలపై ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ వచ్చారు. కాలువలపై పెట్టిన అడ్డంకులను తొలగించుకుంటూ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారం బయటకు నెట్టి సాగునీటి కోసం అవస్థలు పడ్డారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని అన్నదాతలు వాపోయారు. వంశధార అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి. జుబేదాబి భౌతికకాయానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులు

Last Updated : Aug 30, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.