శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు ఎనిమిదో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎర్రన్నాయుడు జోహార్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మెుత్తం దద్దరిల్లింది. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెదేపా కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నరసన్నపేట తెదేపా నేతలు యూనియన్ కార్యాలయం, మార్కెట్, తెదేపా కార్యాలయాల్లో ఎర్రన్నాయుడి విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండీ...