పేదలకు ఇళ్ల స్థలాల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిజమైన పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారికి కేటాయించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. గతంలో కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరుపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి... ఛ కొమ్ములు తిరిగిన గేదె..జన్యుపరమైన లోపాలే కారణమటా..!