టెక్కలిలో..
తెదేపా శాసనసభ పక్ష ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును వెంటనే విడుదల చేయాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భౌతిక దూరం పాటిస్తూ ముఖానికి నల్లరంగు గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. టెక్కలి మండల తెదేపా అధ్యక్షుడు బాగాది శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన నిరసనలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాశిబుగ్గలో..
అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం తగదని పలువురు తెదేపా నాయకులు పేర్కొన్నారు. జిల్లాలోని కాశిబుగ్గలో తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురావు, విఠల్రావు, కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, మల్ల శ్రీనివాస్, నాగరాజు, రవి శంకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పాలకొండలో..
మాజీ మంత్రి తెదేపా నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా పాలకొండ పట్టణంలో తెదేపా శ్రేణులు నిరసనకు దిగాయి. ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని..దొంగ దారిలో అరెస్టు చేయడం సబబు కాదని మాజీ జెడ్పీటీసీ అన్నారు. ఈ ఆందోళనలో తెదేపా నాయకులు లింగమూర్తి, సింహాద్రి, సీతారాం, జయశంకర్, సుమంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు