ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు అందించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో సుమారు 4వేల ఎకరాలకు పైగా సాగునీరు అందక వరి నాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు బ్లాక్ మార్కెట్లలో యూరియాను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు కాస్త రైతు వినాశక కేంద్రాలుగా మారాయని దుయ్యబట్టారు. వీటిపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని.. పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి