ETV Bharat / state

శంకుస్థాపనలే కానీ నిర్మాణంపై లేదు చిత్తశుద్ధి

author img

By

Published : Jul 28, 2020, 4:28 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో నారాయణపురం ఆనకట్ట ఒకటి. కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందింది అంతంత మాత్రమే. వేల ఎకరాల మీదుగా కాలువలు పారుతున్నా.. సాగునీరు మాత్రం నేటికీ అందని ద్రాక్షే. నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులకు మరోమారు బ్రేక్ పడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖరీఫ్‌లో సాగునీరందించేందుకు ఆనకట్ట నుంచి అధికారులు... నీరు విడుదల చేశారు. దీంతో జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జైకా) నిధులతో చేపడుతున్న పనులను నిలిపివేయాల్సి వచ్చింది. పనులు పూర్తి చేసేందుకు వచ్చే నెలతో గడువు ముగియనుంది. కానీ నేటికీ 4 శాతం పనులు మాత్రమే పూర్తవడంతో రైతన్న గుండెల్లో గబులురేపుతున్న వైనంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

story on narayanapuram project in srikakulam district
శంకుస్థాపనలే కానీ నిర్మాణంపై లేదు చిత్తశుద్ధి

శ్రీకాకుళం జిల్లాల్లో పుష్కలమైన సాగునీటి వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఏటా నానాపాట్లు పడుతున్నారు. తూతూమంత్రంగా చేస్తున్న పనుల్లో నాణ్యత లోపం కారణంగా సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ కోవలోకే వస్తోంది.. నారాయణపురం ఆనకట్ట. నాగావళి నదిపై అరవై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. జిల్లాలోని ఏడు మండలాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టును కాపాడే ప్రభుత్వం కోసం ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో.. తెదేపా ప్రభుత్వం నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణకు ముందుకు వచ్చింది. రెండేళ్ల కిందట (జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ) జైకా నిధులు మంజూరు చేసింది. దీంతో ఆనకట్ట పరిస్థితి మారుతుందని.. సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు ఆశ పడ్డారు. కానీ పనులు పూర్తి చేసేందుకు వచ్చే నెలతో గడువు ముగియనుంది. అయితే నేటికీ 4 శాతం పనులు మాత్రమే పూర్తవడం.. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శం.

గతేడాది ఆధునికీకరణ పనులు ప్రారంభం
నారాయణపురం ఆనకట్ట పరిధిలోని శ్రీకాకుళం, గార, సంతకవిటి, పొందూరు, బూర్జ, ఆమదాలవలస, ఎచ్చెర్ల మండలంలోని... 92 గ్రామాల్లో 37 వేల 53 ఎకరాలకు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరందుతోంది. అర్థశతాబ్దం ముందు నిర్మించిన ఆనకట్టతో పాటు కుడి, ఎడమ కాలువలు శిథిలావస్థకు చేరుకోవడంతో గతేడాది ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. 2020 ఆగస్టుకల్లా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇంకా పనులు ప్రారంభదశలోనే ఉండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు పూడిక తీత, మట్టి పనులు మాత్రమే చేపట్టారు. శాశ్వత పనులకు శ్రీకారం మొదలవ్వలేదు. ఇంతలో ఖరీఫ్ సీజన్ రావడంతో ఆనకట్ట అభివృద్ధి పనులు నిలుపదల చేశారు. సాగునీరు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో... ఆనకట్ట నుంచి అధికారులు సాగునీరు విడుదల చేశారు.

సాంకేతిక పరమైన అనుమతి లభించింది

ఆనకట్ట ఆధునికీకరణ పనులకు ఏ ప్యాకేజీ కింద రూ.62 కోట్ల 46 లక్షలు, బీ ప్యాకేజీ కింద రూ.49 కోట్ల 64 లక్షలతో పనులు చేపట్టేందుకు విశాఖపట్నం చీఫ్ ఇంజనీర్ నుంచి సాంకేతిక పరమైన అనుమతి లభించింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకొని పనులు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఆనకట్ట కుడి కాలువలో 20 కిలో మీటర్లు, ఎడమ కాలువలో 19 కిలో మీటర్లు మేరమట్టి పనులు చేశారు. రెండు కాలువలకు సంబంధించి కాంక్రీట్ పనులకు సాంకేతిక పరమైన డిజైన్లు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 4 శాతం పనులు పూర్తయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కాలువల ఆధునికీకరణ పనులు చేసేందుకు ఏటా జనవరి నుంచి అవకాశమున్నప్పటికీ అధికారులు ప్రతి ఏడాది జూన్, జూలై నెలల్లో పనులు ప్రారంభిస్తున్నారని.. ఫలితంగా పనుల్లో జాప్యం జరుగుతోందని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయకట్టుకు నీరు అందడం గగనమైపోయింది. దీంతో కాలువలను చూస్తే రైతు కంట కన్నీరే వస్తోంది.

శంకుస్థాపన చేసినా పనులు అవ్వలేదు

ఆనకట్ట పునర్నిర్మాణం కోసం 1999 సంవత్సరం జూన్ 12 వ తేదీన అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అలాగే 2003 నవంబర్ ఆరో తేదీన ఆధునికీకరణ పనుల కోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. మళ్లీ తెదేపా ప్రభుత్వంలో జైకా నిధులను సమకూర్చారు. దీంతో మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కింజరాపు అచ్చెన్నాయుడు... 2019 సంవత్సరం ఫిబ్రవరి 19 తేదీన శుంకుస్థాపన చేశారు. ఇప్పుడు వైకాపా సర్కారు కూడా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. తాజాగా అనకట్ట పనుల పురోగతిని సభాపతి తమ్మినేని సీతారాం, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పరిశీలించారు.

వరుణుడి జాడ కోసం రైతుల ఎదురుచూపులు

అధికారుల తీరుతో ఇటు కాలువ పనులు జరగక, ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరు అందక, వరుణుడి జాడ కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నేటికీ ఫలితంలోని రాని ఆధునికీకరణ ప్రక్రియ.. ఇకనైన సఫలీకృతం అవుతుందని అన్నదాతలు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం ఎంతో అవసరం : కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.