ETV Bharat / state

తెదేపా నేతల అరెస్టులపై నిరసనలు తీవ్రతరం

author img

By

Published : Jun 13, 2020, 5:04 PM IST

తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్‌, జేసీ ప్రభాకర్ ‌రెడ్డిల అరెస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. తెదేపా నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

tdp protests
tdp protests

తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకరరెడ్డిల అరెస్టులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. వైకాపా సర్కార్​ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా నందిగామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇందులో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయడానికి సీఎం కుట్రలు పన్నుతున్నారని ఆమె విమర్శించారు. చల్లపల్లిలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. అచ్చెన్నాయుడుని బందిపోటు మాదిరిగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలే వైకాపా ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

ప్రజలే గుణపాఠం చెబుతారు...

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్షలు చేపట్టారు. వాడపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నల్ల చొక్కా ధరించి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. వరుపుల రాజా ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో దళితులు ఆందోళన చేపట్టారు.

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు ఆధ్వర్యంలో పాలకొల్లులోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడు తరహా రాజకీయం చేస్తూ ఉంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో తేదేపా బీసీ నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

త్వరలో క్విట్ ఏపీ ఉద్యమం ...

రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా త్వరలో క్విట్ ఏపీ ఉద్యమం రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. నరసాపురంలో ఆయన తన ఇంటివద్దే నిరసన దీక్ష చేశారు. నరసాపురం పట్టణంలో అంబేడ్కర్ సెంటర్​లో తెదేపా శ్రేణులు నిరసన తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని క్యాంపు కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని వైకాపా ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు.

శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో రోడ్లపై బైఠాయించి తెదేపా నేతలు నిరనస తెలిపారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం ఆశోక్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, తెదేపా జిల్లా అధ్యక్షురాడు గౌతు శిరీష నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతి పురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

దివ్యాంగుడు నిరసన

తెదేపా నేతల అరెస్టులపై అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో రంగనాథ్ అనే దివ్యాంగుడు నిరసన చేపట్టారు. జిల్లాలోని గుత్తి, పామిడి మండలాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు రోడ్లపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతపురంలో గాంధీ విగ్రహం దగ్గర చంద్రదండు నాయకులు నిరసన చేపట్టారు.

నారావారిపల్లెలోనూ...

చిత్తూరు జిల్లా పుత్తూరులో తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నారావారిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నిరసన దీక్ష చేశారు.

కర్నూలులో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జ్యోతీరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి... వినతిపత్రం సమర్పించారు. కడపలో తెదేపా నాయకులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. కడప తేదేపా ఇంఛార్జ్ అమీర్ బాబు పట్టణంలోని స్వగృహంలో నిరసన దీక్ష చేపట్టారు. విశాఖపట్నం మన్యం పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి... తెదేపా నాయకులు, కార్యకర్తలతో తన ఇంటి వద్ద నిరసన చేశారు. హుకుంపేటలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.