రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. గ్రామాల్లో ఆరాచకాలు చేస్తున్నారని వైకాపా నాయకులతో పాటు కార్యకర్తలపై ఆయన మండిపడ్డారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఇదే తంతూ నడుస్తోందని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఉప్పినవలసలో జూలై 5న తెదేపా వర్గానికి చెందిన వారిపై కత్తులతో దాడి చేశారని రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ఆ బాధితులతో కలిసి ఎస్పీ అమిత్‌బర్దార్‌ను కలిశారు. ఈ దాడిలో గాయపడిన వారికి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: vishaka steel: 'విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ'ను నిరసిస్తూ.. కార్మికుల ఆందోళన