ETV Bharat / state

అష్ట దిగ్బంధనం.. రక్షిత జోన్‌లో కొనసాగుతున్న సిక్కోలు

శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాలేదు. ప్రస్తుతం గ్రీన్‌ జోన్‌లో ఉన్న జిల్లా లాక్‌డౌన్‌లోనే కొనసాగుతుందా.. కొన్ని సడలింపులతో అమలవుతుందా అన్నది మాత్రం ప్రశ్నార్థకం. జిల్లాలో స్వాబ్‌నమూనాల ఫలితాల్లో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంటోంది. సుమారు 500కు పైగా నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. వివిధ కారణాలతో మృతిచెందిన వారి ఫలితాలు అందకపోవడంతో ఆయా మృతదేహాలు జిల్లాలోని శవాగారంలోనే భద్రపరిచారు. మరోవైపు స్వాబ్‌ సేకరణలో వైద్యసిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరింత కట్టుదిట్టమైన భద్రతవలయంలో ఉండి నమూనాలు సేకరించే విధంగా రూపుదిద్దుకున్న అద్దాల పెట్టెలు సోమవారం నుంచి వినియోగంలోకి వచ్చాయి.

Srikakulam
కాకినాడ, విశాఖ నుంచి రావాల్సిన ఫలితాలు
author img

By

Published : Apr 14, 2020, 5:08 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా అనుమానిత కేసుతో జిల్లా యాంత్రాంగం అప్రమత్తమైంది. వివిధ ప్రాంతాల్లో నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. కాకినాడ, విశాఖ నుంచి ఫలితాలు రావాల్సి ఉంది. అనుమానం ఉన్న మూడు మృతదేహాలు శవాగారంలోనే భద్రం చేశారు.

కట్టుదిట్టమైన పర్యవేక్షణ

జిల్లాలో కంచిలి నుంచి మొట్టమొదటి వైరస్‌ అనుమానిత కేసుతో కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారందరినీ ఇళ్లకే పరిమితం చేసి గృహనిర్బంధం చేశారు. ఇళ్లకు క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లు అతికించి ఏఏ సమయాల్లో ఏ స్థాయి అధికారి వెళ్లి పరిశీలించింది జిల్లా కేంద్రం నుంచే పర్యవేక్షించేవిధంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

అనంతరం కుదిపేసిన దిల్లీ ఘటనలో పాల్గొన్నవారితో కలిసిమెలిసి వచ్చినవారిని గుర్తించి ఏకాంతంలో ఉంచారు. జిల్లాకు చెందిన ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని రాజకీయ ఒత్తిళ్లతో రప్పించాల్సి వచ్చినా వారందరినీ ప్రత్యేక వసతిగృహాల్లో ఒక్కొక్కరిని ఒక్కో గదిలో ఉంచారు. ఆహారం తీసుకునే సమయంలో తప్ప ఒకరినొకరు కలిసే పరిస్థితి లేకుండా కట్టుదిట్టం చేశారు. ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో లేదా నడక మార్గాల్లో జిల్లాలో ప్రవేశించే వీలు లేకుండా కఠిన చర్యలు చేపట్టారు.

తొలుత విశాఖ పట్నం వెళ్లేందుకు అడపాదడపా అనుమతి లేఖలు ఇచ్చినప్పటికీ అనంతరం వాటికి కూడా తావు లేకుండా నిలిపివేశారు. రోజూ విశాఖపట్నం వెళ్లి వస్తున్నారని తెలిసి ఇద్దరు జిల్లా అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. విజయనగరం జిల్లా నుంచి ప్రవేశించే వెసులుబాటు ఉన్న జిల్లాలోని వెంకటాపురం, కమ్మశిగడాం, పొన్నాడ తదితర ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పైడిభీమవరం, ఇచ్ఛాపురం వద్ద ఇతరులను రానీయకుండా ప్రత్యేక దృష్టి సారించారు. మూడో విడత సర్వేలో కూడా దాదాపుగా 1,900 మందిని గృహనిర్బంధం చేసి వారి ఇళ్లకు క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లను అతికించారు. ‘కరోనా నియంత్రణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం బాగుంది. లాక్‌డౌన్‌లో ప్రజలు బాగా సహకరించారు. అంతర జిల్లా సరిహద్దుల్లో యధాస్థితి కొనసాగాలని కోరుకుంటున్నాం’ అని కలెక్టర్‌ నివాస్‌ అభిప్రాయపడ్డారు.

వేదికల జాప్యం

స్వాబ్‌ నమూనాలు పంపిస్తున్నప్పటికీ పరీక్షల ఫలితాలు అందడంలో జాప్యం జరుగుతోంది. తొలుత కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకే నమూనాలు పంపించారు. అక్కడ ఎక్కువ సంఖ్యలో పేరుకుపోయి ఒత్తిడి తలెత్తుతోందని భావించి ఈ నెల 8, 9, 10వ తేదీల్లో సేకరించిన నమూనాలను విశాఖపట్నంకు పంపించారు. ఇక్కడకు పంపించిన దాదాపుగా 300ల్లో కేవలం 41 మాత్రమే అందాయి. ఇంకా 260 వరకు రావాల్సి ఉంది. ఈక్రమంలో తరవాత రెండు రోజుల్లో అంటే 11, 12వ తేదీల్లో సేకరించిన నమూనాలను మళ్లీ కాకినాడకే పంపించారు.

మంగళవారం నమూనాలకు అక్కడికే పంపించారు. ఇందు కోసం ప్రత్యేక వాహనాలను సమకూర్చారు. ఏరోజుకారోజు పరీక్షించిన నమూనాలకు సంబంధించి నివేదికలు సాయంత్రానికల్లా జిల్లా వైద్యాధికారులకు ఆన్‌ లైన్‌లోనే అందుతున్నాయి. ఇంకా దాదాపుగా 500కుపైనే నివేదికలు అందాల్సి ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని సర్వజన ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటుచేసే ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

అయిదు రోజులుగా శవాగారంలోనే

శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి శవాగారంలోనే మూడు మృతదేహాలు గత అయిదారు రోజులుగా ఉన్నాయి. శ్రీకాకుళంలో అనుమానిత యువకుడి మృతికి సంబంధించి ఒకటి, ఇచ్ఛాపురంలో శ్వాసకోశ సంబంధవ్యాధితో మృతి చెందిన మరొకరిది, సోంపేట నుంచి వచ్చి గుండెపోటుతో మృతిచెందిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించలేదు. చనిపోయిన తరవాత ఒకరిది, బతికుండగానే ఇద్దరి నుంచి స్వాబ్‌ సేకరించి పరీక్షలకు పంపించారు.

వీరి నమూనాలకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఫలితాల్లో నెగిటివ్‌ అని తేలితేనే ఆయా ప్రాంతాలతోపాటు వారికి చికిత్స అందించిన వైద్యుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తతో మృతదేహాలను ఆసుపత్రిలోనే భద్రపరిచారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా వారికి నచ్చజెప్పారు.

సోమవారం నాటికి పరిస్థితి

విదేశాల నుంచి వచ్చిన వారు : 1,445 మంది

14 రోజులు క్వారంటైన్‌ పూర్తయినవారు: 1,439 మంది

14 రోజుల లోపు ఉన్నవారు : ఆరుగురు

13న పంపించిన నమూనాలు: 97

మొత్తం నమూనాలు: 878

ఇప్పటి వరకు ఫలితాలు అందినవి: 324

నెగిటివ్‌ ఫలితాలు: 324

అందాల్సిన నివేదికలు: 554

ఇదీ చదవండి:

వేలు జమ... రైతులకు మేలు సుమా!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.