కొవిడ్ బాధితులకు వ్యాధిపై పూర్తి అవగాహన కల్పించి వారిలో మనోధైర్యం నింపాలని, అప్పుడే వారికి తమకు ఆరోగ్యభద్రత ఉందనే భావం కలుగుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. ఇందుకు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కొవిడ్ విభాగంలో వైద్యం చేయడానికి అవసరమయ్యే మౌలిక వసతులు కల్పిస్తామని వైద్యులకు, పీజీ విద్యార్థులకు హామీ ఇచ్చారు.
ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై కలెక్టర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని విభాగాల్లో అవసరమైన వైద్యపరికరాలు, సామగ్రి అవసరం ఉందని గుర్తించిన ఆయన వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రోజు 20 నుంచి 30 కేసులు వస్తున్నాయని, వీరిలో అయిదుగురు చివరి దశలో వస్తున్నారని వైద్యులు వివరించారు.
ఇదీ చదవండి: కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు