శ్రీకాకుళం జిల్లాలో మద్యం కొనుగోలుదారులు గొడుగు, మాస్కు తప్పనిసరిగా వినియోగించాలని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. గొడుగు వేసుకోవడం వల్ల ఎండ వేడిమి నుంచి రక్షణతో పాటు భౌతిక దూరం పాటించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని స్పష్టం చేసిన కలెక్టర్..... మాస్క్ ధరించని వారికి సరకు విక్రయం ఉండదని తేల్చి చెప్పారు. అలాగే జిల్లాలో క్షౌరశాలలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి...భళా పోలీస్: ఓ వైపు కాఠిన్యం.. మరోవైపు ఔదార్యం