IRCTC gave good news to pilgrims: తక్కువ ఖర్చుతో దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూద్దామనుకునే వారికి ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) శుభవార్త చెప్పింది. దక్షిణ భారత దేవాలయాలను సందర్శించాలనుకునే ప్రయాణికుల కోసం తక్కువ ఖర్చుతో భారతీయ రైల్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయాణికులకు ప్రయోజనం కోసం ఈ రైలును ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ బి. చంద్రమోహన్ తెలిపారు.
రైలు బయల్దేరు వివరాలు: ఈ రైలు డిసెంబర్ 3న విశాఖపట్నంలో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు బయల్దేరి శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుందని.. తిరిగి 12వ తేదీన విశాఖపట్నం వస్తుందని.. ఈ రైలులో సౌత్ ఇండియా మొత్తం పర్యటించవచ్చని అధికారులు తెలిపారు.
సందర్శించు దేవాలయాలు: యాత్రలో భాగంగా దక్షిణ భారతదేశంలోని కాంచీపురం, కన్యాకుమారి, మధురై, మహాబలిపురం, రామేశ్వరం, శ్రీశైలం అలాగే తంజావూరు మొదలగు ప్రాంతాలలో ఉన్న దేవాలయాలను భక్తులు దర్శించుకోవచ్చని తెలిపారు.
బడ్జెట్ : ఇందులో స్టాండర్డ్, బడ్జెట్ అనే ప్యాకేజీలుంటాయని జీఎస్టీతో కలిపి ఒక్కొక్కరికి రూ.18,685 నుంచి 19,345 వరకు ధర ఉంటుందని పేర్కొన్నారు. ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలతో పాటు 10 రాత్రులు 11 రోజులు ప్రయాణం సాగుతోందని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు.
ఇవీ చదవండి: