శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పురుషోత్తపురం వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాకపోకలు సాగించే వారికి పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక నుంచి ఇంటిలిజెంట్ మానిటరింగ్ ఎనాలసిస్ సర్వీస్ సెంటర్ పేరిట సంచార వైద్య విభాగం బస్సు ఇచ్ఛాపురం చేరుకుంది. ఇక్కడ శిబిరం పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం నమూనాలు సేకరించి శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో పరీక్షలు విభాగానికి తరలిస్తున్నారు. ఈ బస్సు ద్వారా పరీక్షలు జరిపేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారని మండలం తహసీల్దార్ పి.అమల తెలిపారు.
ఇది చదవండి 'మానవ తప్పిదంతోనే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం!'