ఆమదాలవలస మండలంలోని కలివరం, ముద్దాడ గ్రామాల్లో తమ్మినేని సీతారం పర్యటించారు. నాగావళి నదిలో దిగడానికి అనువుగా ఉండే ర్యాంపులు గతంలో వరదకు కొట్టుకుపోయాయని.. వాటిని తిరిగి నిర్మించాలని కోరారు. తాగునీరు ఇబ్బందిగా ఉందని మంచినీటి కుళాయిలు, కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. పాఠశాల శిథిలావస్థకు వచ్చిందని స్కూల్ లేక బయట చెట్ల కింద పిల్లలు పాఠాలు వింటున్నారన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి చేయిస్తానని సభాపతి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీ నిర్ణయంపై 4 లంచ్‌మోషన్ పిటిషన్లు.. విచారణకు స్వీకరించిన హైకోర్టు