స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్లో భాగంగా తన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా తొగరాంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రెండు దశల పోలింగ్ లో చూపించిన స్ఫూర్తిని పురపాలిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొగరాం పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా తమ్మినేని సతీమణి వాణిశ్రీ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి:
పంచాయతీ ఎన్నికలు మూడో దశ పోలింగ్: 12:30 వరకు 66.48 శాతం పోలింగ్