శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దన్ననపేట గ్రామంలో స్పీకర్ తమ్మినేని సీతారాం వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం, సీసీ రోడ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామస్థాయిలో సుపరిపాలన అందించేందుకు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు నాంది పలికామన్నారు.
ఇదీచదవండి