శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయంలో శుక్రవారం ఓ నాగుపాము కలకలం రేపింది. కార్యాలయం తెరిచే సమయంలో నాగుపాము కనిపించినట్టు ఉద్యోగి చెప్పారు. అది రికార్డు గదిలోకి దూరడం వల్ల ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే కార్యాలయం ఖాళీ చేసి... పక్కనే ఉన్న వరండాలోకి వెళ్లారు. రికార్డు గదులను తనిఖీ చేయించారు. కాని పాము కనిపించలేదు.
ఇదీ చదవండి :
విశాఖలో ఎనిమిది అడుగుల నాగుపాము.. దాహం తీర్చిన స్నేక్ సేవర్