ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యంతో రాష్ట్రంలోకి వచ్చే లారీలను రాష్ట్ర సరిహద్దుల వద్దే నిలిపివేయడంపై రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి లారీ ఓనర్స్ అసోషియేషన్ లేఖ రాసింది. ముందస్తు సమాచారం లేకుండా ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో లారీలు నిలిపివేస్తున్నారని లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మంత్రికి లేఖ రాశారు. ఇప్పటికే సుమారు 200 ధాన్యం లారీలను నిలిపివేసినట్లు లేఖలో తెలిపారు.
లారీలను సరిహద్దుల వద్ద ఎందుకు ఆపివేశారో తమకు తెలియడంలేదని ఈశ్వరరావు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారని... ఇలాంటి జీవో విడుదలైనట్లు తమకు సమాచారం లేదని తెలిపారు. శ్రీకాకుళంలో ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడి సరిహద్దు వద్ద నిలిపివేసిన ధాన్యం లారీలను వెంటనే విడుదల చేయాలని.. లారీ యజమానుల సంఘం మంత్రికి విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి : సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులకు శ్రీకారం