శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృష్ణాపురం రెండోవార్డులో పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే యంత్రంలోని సాంకేతిక సమస్యలతో బియ్యం పంపిణీ నిలిచిపోయింది. రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు.. బయోమెట్రిక్ యంత్రాలు మొరాయించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ సమస్యతో 500 మంది వినియోగదారులకు కేవలం 50మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు వాలంటీర్లు తెలిపారు. త్వరలోనే సిగ్నల్ సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో రేషన్ పంపిణీ చేస్తామని తహశీల్దార్ రాంబాబు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-కావేరి పిలుపు..3500 కి.మీ జగ్గీ వాసుదేవ్ బైక్ ర్యాలీ!