ETV Bharat / state

Radhe Shyam Movie: 'రాధేశ్యామ్' థియేటర్​కు తాళం.. ఎందుకంటే? - రాధే శ్యామ్ సినిమా బెనిఫిట్ షో వేసిన నిలిపివేసిన అధికారులు

Radhe Shyam Movie: ప్రభాస్​, పూజా హెగ్డే కలిసి జంటగా నటించిన రాధేశ్యామ్​ సినిమా బెనిఫిట్​ షోను అధికారులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా బెనిఫిట్​ షో వేశారని థియేటర్​కు తాళాలు వేశారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

Radhe Shyam Movie
రాధే శ్యామ్ సినిమా బెనిఫిట్ షో వేసిన నిలిపివేసిన అధికారులు
author img

By

Published : Mar 11, 2022, 12:59 PM IST

Radhe Shyam Movie: శ్రీకాకుళం జిల్లా రాజాంలో రాధే శ్యామ్ బెనిఫిట్​ షోను అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఎస్వీసి థియేటర్​లో అనుమతి లేకుండా బెనిఫిట్ షో వేశారని అధికారులు థియేటర్​కు తాళాలు వేశారు. థియేటర్​లో సినిమా ప్రదర్శించవద్దని నోటీసులు అంటించారు. థియేటర్​కు తాళాలు వేయడంతో ప్రభాస్ అభిమానులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టికెట్​ ధర పెంపునకు అనుమతి..

రాధేశ్యామ్ సినిమా ప్రీమియం టికెట్ ధరను రూ. 25 పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్లు వెచ్చిస్తే టికెట్ ధరను పెంచుకునే అవకాశాన్ని నిర్మాతలకు ప్రభుత్వం కల్పించింది. సినిమా బడ్జెట్ రూ. 170 కోట్లు ఖర్చైనట్లు నిర్మాణ సంస్థ బిల్లులు ప్రభుత్వానికి సమర్పించటంతో.. ఈ మేరకు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది.

లవర్​బాయ్​గా ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 1970 నాటి పీరియాడికల్​ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్​కు జోడిగా పూజా హెగ్డే నటించింది.

ఇదీ చదవండి:

Municipal Workers Protest: పారిశుద్ద్య కార్మికుల 'చలో విజయవాడ'.. అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.