శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కేరళలో ఎర్నాకుళం నుంచి పశ్చిమ బంగా ముషీరాబాద్‌కు బస్సు బయల్దేరినట్లు గుర్తించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. త్రుటిలో తప్పిన ఈ ప్రమాదంలో పలువురు వలస కూలీలు గాయపడ్డారు .
బస్సులో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలతో పాటు 37 మంది ప్రయాణిస్తున్నారు . ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హైవే అంబులెన్స్ అక్కడకు చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. ఘటనస్థలికి చేరుకున్న నరసన్నపేట తహసీల్దార్ ప్రవల్లిక ప్రియ వారికి భోజన వసతి సదుపాయాలు కల్పించారు . వారందరినీ పశ్చిమబంగాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.