కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా పాలనాధికారి నివాస్ తెలిపారు. ఇందులో భాగంగానే ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. ఎవరికైనా జ్వరం వచ్చిన లక్షణాలుంటే స్వచ్ఛందంగా వచ్చి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 486 కేసులు నమోదయ్యాయని... వీరిలో వలస కార్మికులు, క్వారంటైన్ కేంద్రం నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారని వివరించారు.
లాక్డౌన్ సడలింపులతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని... దాని వల్ల జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. పలాస, మందస, బూర్జ, ఇచ్చాపురం మండలాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని... ప్రజలు మాస్కులు ధరించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కేసులు ఎక్కువగా నమోదైతే లాక్డౌన్ విధిస్తామని నివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: