సీతంపేట, రేగిడి, వీరఘట్టం మండలాల్లో పలు పనులను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పరిశీలించారు. సీతంపేట గురుకుల పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలించిన ముఖ్య కార్యదర్శి.. కార్పొరేట్ పాఠశాలల కంటే.. అధిక స్థాయిలో ఉన్నామని భావన విద్యార్థుల్లో కలగాలన్నారు. సీతంపేట మండలం పెద్దూరులో నాడు-నేడు మనబడి కార్యక్రమంలో కొనసాగుతున్న పనులు, రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుతోపాటు, గ్రామ సచివాలయాల పనితీరును అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు.
రేగిడి మండలం సంకిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రవీణ్ ప్రకాశ్.. 9,10 తరగతులను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న సిలబస్ అడిగి తెలుసుకున్న ఆయన.. జగనన్న విద్యా కానుకలో పంపిణీ చేసిన బ్యాగ్‌లు, పుస్తకాలు, బూట్లను పరిశీలించారు. విద్యార్థులు బూట్లు వేసుకోకపోవడం పట్ల అధికారులు, ఉపాధ్యాయులను ముఖ్య కార్యదర్శి ప్రశ్నించారు. అనంతరం వీరఘట్టం మండలం వండవ చేరుకుకొని అక్కడ నాడు-నేడు పనులను పరిశీలించారు. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన