పోలీసు సేవలు స్ఫూర్తిదాయకమని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, జేసీ సుమిత్ కుమార్‌తో కలిసి సభాపతి సీతారాం అమరులకు నివాళులర్పించారు.
అమర వీరుల జాబితా కలిగిన పుస్తకాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. చైనా తెంపరితనంతో వచ్చి దాడులకు పాల్పడిన సమయంలో సరిహద్దుల్లో ఉన్న పోలీసులు వీరోచితంగా పోరాడి అసువులు బాశారన్నారు. ప్రజలు కంటి నిండా నిద్ర పోతున్నారంటే.. పోలీసులు, భద్రతా దళాలు కారణమని అన్నారు.
పోలీసుల సేవలను ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చిన సభాపతి.. పోలీసుల గురుతరమైన బాధ్యత నిర్వహణలో తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రజలు సూచనలు ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి:
తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు...హనుమంత వాహనంపై శ్రీవారి దర్శనం