శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని 20 కి పైగా గ్రామాలు మండల కేంద్రానికి చేరుకోవాలంటే మహేంద్రతనయ నది దాటి రావాల్సిందే. కొరసవాడ, కాగువాడ గ్రామాల ప్రజలు వ్యవసాయ పనుల కోసం వెళ్లాలన్న మరో మార్గం లేదు. నది దాటి వెళ్లాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కొరసవాడ, రాయగడ మద్య వంతెనను మంజూరు చేసింది. మూడు నెలల కిందట శంకుస్థాపన చేసిన ఇప్పటికీ తట్టెడు మట్టి తీయలేదు. పనులు ప్రారంభించక పోవడంతో ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రమాద కరంగా ప్రవహిస్తున్న నదిలోనే ఈదుతూ ఓడ్డు చేరుకుంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే 20 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపి వీలైనంత తొందరగా వంతెన నిర్మాణం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: Pupils sick after had Midday meals : మధ్యాహ్నం భోజనం తిని ఆస్పత్రి పాలైన 95 మంది విద్యార్థులు..