Minister Appalaraju: శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుకు నిరసన సెగ తగిలింది. రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభించి అక్కడి నుంచి బయల్దేరిన మంత్రి వాహనాన్ని పలాస మండలం కంబ్రిగాం గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. కౌలు రైతులుగా తమ ఆధీనంలో ఉన్న భూములకు.. బినామీ రైతుల పేర్లతో పట్టాలు ఇచ్చారంటూ మండిపడ్డారు. తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇచ్చిన పట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామన్న మంత్రి అప్పలరాజు హామీతో శాంతించారు.
ఇదీ చదవండి: ఏపీకి రూ.28 వేల కోట్లు ఇచ్చాం.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్రం