శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. మండలంలోని 30 పంచాయతీల్లో వైకాపా, తెదేపా, స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.
సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పథకం ప్రకారం భర్త హత్య.. గొడవలో బయటపడ్డ నిజం