ETV Bharat / state

సాయం చేసేందుకు వెళ్లి...ప్రాణాలు పొగొట్టుకున్నాడు! - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

సాయం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వెంకటాపురంలో జరిగింది.

one person died in srikakulam dst due to current shock

author img

By

Published : Aug 15, 2020, 3:01 PM IST

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. గ్రామంలో ఓ వ్యక్తి భవనానికి పైకప్పు రేకులు వేసేందుకు సమీపంలోని పొలంలో వ్యవసాయ పని చేసుకుంటున్న మంచాల గణపతి(55) అనే కూలీని సాయం చేసేందుకు పిలిపించాడు. గణపతి పొలంలోనుంచి వచ్చి పైకప్పు రేకులు అందిస్తుండగా భవనానికి ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​కు ఇనుప పైపులు తగిలాయి. గణపతి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. గణపతికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చూడండి

పలమనేరు నియోజకవర్గ పరిధిలో ప్రమాదాలు-నేరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.