శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ప్రహా రాజపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రొంపి వలస గ్రామానికి చెందిన చిన్నారావు(50) మృతి చెందారు. పాతపట్నం నుంచి సీతారాంపల్లి వైపు ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసేందుకు ద్విచక్రవాహనందారుడు యత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ట్రాక్టర్ కిందపడిపోయాడు. తలకు గాయమై... అక్కడికక్కడే చిన్నారావు మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి