శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకం వద్ద ఉన్న పార్కులో ధ్వంసమైన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించారు. బుద్ధుని చేయి విరగ్గొట్టిన ఘటన వివాదాస్పదం కావటంతో పోలీసులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు మరమ్మతులు జరిపించారు.
కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి విగ్రహాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. తెదేపా నేతలు బుద్ధుని విగ్రహాన్ని పరిశీలించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ కేఆర్వీపీ. రాజుతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గాలికి వర్షానికి విగ్రహం చేయి విరిగినట్లు భావిస్తున్నామని.. అయినప్పటికీ ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: