ఒడిశా నంచి ఆంధ్రాకు తరలిస్తున్న 50 సారా ప్యాకెట్లను ఇచ్చాపురం ఎక్సైజ్ పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. ఇచ్చాపురం మండలంలోని జాతీయ రహదారి లొద్దపుట్టి కూడలి ధనరాజ తులసమ్మ ఆలయం వద్ద తనిఖీలు చేశారు.
ఇచ్చాపురం గ్రామానికి చెందిన కె కృష్ణ ఆచారి 50 సారా ప్యాకెట్లతో పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ జనార్దన్ రావుతెలిపారు.
ఇదీ చూడండి: